ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

ఎజ్రా 2

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1నెబుకద్నెజరు రాజు బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్ళిన వారికి ఆ దేశంలో పుట్టి చెర నుండి విడుదల పొంది యెరూషలేము, యూదా దేశాల్లో తమ తమ పట్టణాలకు వెళ్ళడానికి అనుమతి పొందినవారు.
2వారిలో జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా, అనేవాళ్ళు ఉన్నారు. బబులోను నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజల లెక్క ఇది.
3పరోషు వంశం వారు 2, 172 మంది.
4షెఫట్య వంశం వారు 372 మంది.
5ఆరహు వంశం వారు 775 మంది.
6పహత్మోయాబు వంశం వారు యేషూవ యోవాబు వంశం వారితో కలిపి 2, 812 మంది.
7ఏలాము వంశం వారు 1, 254 మంది.
8జత్తూ వంశం వారు 945 మంది.
9జక్కయి వంశం వారు 760 మంది.
10బానీ వంశం వారు 642 మంది.
11బేబై వంశం వారు 643 మంది.
12అజ్గాదు వంశం వారు 1, 222 మంది.
13అదొనీకాము వంశం వారు 666 మంది.
14బిగ్వయి వంశం వారు 2,056 మంది.
15ఆదీను వంశం వారు 454 మంది.
16అటేరు వంశం వారు హిజ్కియాతో కలిపి 98 మంది.
17బెజయి వంశం వారు 323 మంది.
18యోరా వంశం వారు 112 మంది.
19హాషుము వంశం వారు 223 మంది,
20గిబ్బారు వంశం వారు 95 మంది.
21బేత్లెహేము వంశం వారు 123 మంది.
22నెటోపా వంశం వారు 56 మంది.
23అనాతోతు వంశం వారు 128 మంది.
24అజ్మావెతు వంశం వారు 42 మంది,
25కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు వంశాల వారు 743 మంది.
26రమా గెబ వంశం వారు 621 మంది.
27మిక్మషు వంశం వారు 123 మంది.
28బేతేలు, హాయి గ్రామం వారు 222 మంది.
29నెబో వంశం వారు 52 మంది.
30మగ్బీషు వంశం వారు 156 మంది.
31వేరొక ఏలాము వంశం వారు 1, 254 మంది.
32హారీము వంశం వారు 320 మంది.
33లోదు, హదీదు, ఓనో గ్రామాల వారు 725 మంది.
34యెరికో వంశం వారు 345 మంది.
35సెనాయా వంశం వారు 3, 630 మంది.
36యాజకుల్లో యేషూవ సంతానమైన యెదాయా వంశం వారు 953 మంది.
37ఇమ్మేరు వంశం వారు 1,052 మంది.
38పషూరు వంశం వారు 1, 247 మంది.
39హారీము వంశం వారు 1,017 మంది.
40లేవీయ గోత్రానికి చెందిన యేషూవ, కద్మీయేలు, హోదవ్యా, అనేవారి వంశం వారు మొత్తం 74 మంది.
41గాయకులైన ఆసాపు వంశం వారు 128 మంది.
42ద్వారపాలకులైన షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వంశం వారు 139 మంది.
43నెతీనీయులకు చెందిన జీహా, హశూపా, టబ్బాయోతు వంశాల వారు.
44కేరోసు, సీయహా, పాదోను వంశాల వారు.
45లెబానా, హగాబా, అక్కూబు వంశాల వారు.
46హాగాబు, షల్మయి, హానాను వంశాల వారు.
47గిద్దేలు, గహరు, రెవాయా వంశాల వారు.
48రెజీను, నెకోదా, గజ్జాము వంశాల వారు.
49ఉజ్జా, పాసెయ, బేసాయి వంశాల వారు.
50అస్నా, మెహూనీము, నెపూసీము వంశాల వారు.
51బక్బూకు, హకూపా, హర్హూరు వంశం వారు.
52బజ్లీతు, మెహీదా, హర్షా వంశాల వారు.
53బర్కోసు, సీసెరా, తెమహు వంశాల వారు.
54నెజీయహు, హటీపా వంశాల వారు.
55సొలొమోను సేవకుల వారసులు, సొటయి, సోపెరెతు, పెరూదా వంశాల వారు.
56యహలా, దర్కోను, గిద్దేలు వంశాల వారు.
57షెఫట్య, హట్టీలు, జెబాయీముకు చెందిన పొకెరెతు, ఆమీ వంశాల వారు.
58నెతీనీయులు, సొలొమోను సేవకుల వారసులు మొత్తం 392 మంది,
59ఇంకా తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు, అనే ప్రాంతాల నుండి మరి కొందరు వచ్చారు. అయితే వీరు తమ తండ్రుల కుటుంబాల, వంశాల రుజువులు చూపలేక పోవడం వల్ల వీరు ఇశ్రాయేలీయులో కాదో తెలియలేదు.
60వీళ్ళు దెలాయ్యా, టోబీయా, నెకోదా వంశాలవారు. వీరు 652 మంది,
61ఇంకా యాజకుల వారసులైన హబాయ్యా, హాక్కోజు వంశాలవారు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమార్తెల్లో ఒకామెను పెండ్లి చేసికొన్న వారి పేర్లను బట్టి బర్జిల్లయి అనే వ్యక్తి వంశం వారు.
62వీరు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ వారు తమ యాజక వృత్తిలో అపవిత్రులయ్యారు కాబట్టి వారి పేర్లు కనబడలేదు.
63ఊరీము, తుమ్మీము ధరించుకొనే ఒక యాజకుడు నియామకం అయ్యే వరకూ దేవునికి ప్రతిష్ఠితమైన పదార్థాలను తినకూడదని వారి గవర్నర్ వారికి ఆజ్ఞాపించాడు.
64సమకూడిన ప్రజలు మొత్తం 42, 360 మంది అయ్యారు.
65వీరు కాకుండా వీరి దాసులు, దాసీలు 7, 337 మంది, గాయకులు, గాయనిలు 200 మంది ఉన్నారు.
66వారి దగ్గర గుర్రాలు 736, కంచర గాడిదలు 245,
67ఒంటెలు 435, గాడిదలు 6, 720 ఉన్నాయి.
68గోత్రాల ప్రముఖులు కొందరు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి వచ్చి, దేవుని మందిరం కట్టడానికి స్వచ్చందంగా కానుకలు అర్పించారు.
69ఆలయ నిర్మాణ పని కోసం తమ శక్తి కొద్ది 500 కిలోల బంగారం, 2, 800 కిలోల వెండి, ఖజానాకు ఇచ్చారు. 100 యాజక వస్త్రాలు ఇచ్చారు.
70యాజకులు, లేవీయులు, ప్రజల్లో కొందరు, గాయకులు, ద్వారపాలకులు, నెతీనీయులు తమ తమ పట్టణాలకు వచ్చి నివాసమున్నారు. ఇశ్రాయేలీయులంతా తమ తమ పట్టణాల్లో నివసించారు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.