ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

యెహెజ్కేలు 40

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1మనం బబులోను చెరలోకి వచ్చిన 25 వ సంవత్సరం మొదటి నెల పదో రోజున, అంటే పట్టణం ఆక్రమణకు గురైన 14 వ సంవత్సరం అదే రోజు యెహోవా హస్తం నా మీదకి వచ్చి నన్ను పట్టణానికి తోడుకు పోయాడు.
2దేవుడు నన్ను తన దర్శనాలతో నింపి ఇశ్రాయేలు దేశంలోకి తెచ్చి, చాలా ఎత్తయిన కొండ మీద ఉంచాడు. దానికి దక్షిణాన పట్టణం లాంటిది ఒకటి నాకు కనబడింది.
3అక్కడికి ఆయన నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ మెరిసే ఇత్తడిలాగా ఉండి, చేతిలో దారం, కొలిచే కర్ర పట్టుకుని నగర ద్వారంలో నిలబడిన ఒక మనిషి ఉన్నాడు.
4ఆ మనిషి నాతో ఇలా అన్నాడు. “నరపుత్రుడా, నేను నీకు చూపేవాటిని కళ్ళారా చూసి, చెవులార విని నీ మనస్సులో ఉంచుకో. వాటిని నీకు చూపడానికే నిన్నిక్కడికి తెచ్చాను. నువ్వు చూసిన వాటన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజెయ్యి.” తూర్పు గుమ్మపు ద్వారం నుండి బయటి ఆవరణం వరకు
5నేను చూసినప్పుడు మందిరం చుట్టూ ప్రాకారం ఉంది. ఆ మనిషి చేతిలో 3 మీటర్ల 20 సెంటి మీటర్ల కొలకర్ర ఉంది. ఆయన ఆ గోడ కొలతలు చూసినప్పుడు దాని వెడల్పు 3 మీటర్ల 20 సెంటి మీటర్ల ఎత్తు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది.
6అతడు తూర్పు గుమ్మానికి వచ్చి దాని మెట్లెక్కి గుమ్మపు గడపను కొలిస్తే అది 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది.
7కావలి గది పొడవు, వెడల్పులు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, కావలి గదులకు మధ్య 2 మీటర్ల 70 సెంటి మీటర్లు దూరం ఉంది. గుమ్మపు ద్వారం ప్రక్కనుండి మందిరానికి 3 మీటర్ల 20 సెంటి మీటర్లు దూరం.
8గుమ్మపు ద్వారానికి, మందిరానికి మధ్య 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది.
9గుమ్మపు ద్వారం కూడా 3 మీటర్ల 20 సెంటి మీటర్లు. దాని స్తంభాల వెడల్పు ఒక్కొక్కటి ఒక మీటరు. ఆ ద్వారం మందిరం వైపుకు తిరిగి ఉంది.
10తూర్పు గుమ్మపు ద్వారం లోపల ఇటు మూడు, అటు మూడు కావలి గదులు ఉన్నాయి. ఆ గదులన్నిటికీ ఒక్కటే కొలత. వాటి రెండు పక్కల ఉన్న స్తంభాలకు కూడా ఒక్కటే కొలత.
11ఆ గుమ్మాల ప్రవేశంలో కొలత చూస్తే వాటి వెడల్పు 5 మీటర్ల 40 సెంటి మీటర్లు, పొడవు ఏడు మీటర్లు.
12కావలి గదుల ఎదుట రెండు వైపులా అర మీటరు ఎత్తున్న గోడ ఉంది. గదులు మాత్రం రెండు పక్కలా 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఎత్తు ఉన్నాయి.
13ఒక గది కప్పు నుండి రెండవ గది కప్పువరకూ గుమ్మాల మధ్య కొలిసినప్పుడు 13 మీటర్ల 50 సెంటి మీటర్లు ఉంది. రెండు వాకిళ్ళ మధ్య కూడా అదే కొలత.
1432 మీటర్లు ఎడంగా ఒక్కొక్క స్తంభం నిలబెట్టి ఉన్నాయి. గుమ్మం చుట్టూ ఉన్న ఆవరణం స్తంభాల వరకూ వ్యాపించింది.
15బయటి గుమ్మం నుండి లోపలి గుమ్మం ద్వారపు ఆవరణ వరకూ 27 మీటర్లు.
16కావలి గదులకు గుమ్మాలకు, లోపల వాటికి మధ్య చుట్టూ ఉన్న గోడలకు ప్రక్కగదులకు కమ్ములు పెట్టిన కిటికీలున్నాయి. గోడలోని స్తంభాలకు కూడా కిటికీలున్నాయి. ప్రతి స్తంభం మీదా ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. బయటి ఆవరణం
17అతడు నన్ను బయటి ఆవరణంలోకి తీసికెళ్ళాడు. అక్కడ గదులు, చప్టా ఉన్నాయి. చప్టా మీద 30 చిన్నగదులు ఉన్నాయి.
18ఈ చప్టా గుమ్మాలదాకా ఉండి వాటి వెడల్పుకు సమానంగా ఉంది. ఇది కింది చప్టా.
19అప్పుడాయన కింది గుమ్మం నుండి లోపలి ఆవరణం వరకూ వెడల్పు కొలిచినప్పుడు అది తూర్పున, ఉత్తరాన 54 మీటర్లు ఉంది. ఉత్తర గుమ్మం
20తరవాత బయటి ఆవరణం ఉత్తరాన ఉన్న గుమ్మం పొడవు, వెడల్పులు,
21దానికి రెండు వైపులా ఉన్న మూడేసి కావలి గదులు, వాటి స్తంభాలను వాటి మధ్య గోడలను కొలవగా వాటి కొలత మొదటి గుమ్మం కొలతలాగానే, అంటే 27 మీటర్లు పొడవు, 13 మీటర్ల 50 సెంటి మీటర్లు వెడల్పు ఉన్నాయి.
22ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్న వాటి కిటికీలు, వాటి మధ్యగోడలు తూర్పుద్వారం కొలతకు సమానంగా ఉంది. వాటికి ఏడు మెట్లు ఉన్నాయి. వాటికి ఎదురుగా ఆవరణ ఉంది.
23ఉత్తర ద్వారానికి, తూర్పు ద్వారానికి, లోపలి ఆవరణకు వెళ్ళే రెండు గుమ్మాలున్నాయి. ఈ రెండు గుమ్మాల మధ్య దూరం అతడు కొలిచినప్పుడు అది 54 మీటర్లు ఉంది. దక్షిణ గుమ్మం
24అప్పుడాయన నన్ను దక్షిణం వైపుకు తోడుకుని వెళ్ళాడు. అక్కడ గుమ్మం ఒకటి ఉంది. దాని స్తంభాలను మధ్య గోడలను కొలిచినప్పుడు అదే కొలత ఉంది.
25వాటికి ఉన్నట్టుగానే దీని మధ్యగోడలకు కూడా చుట్టూ కిటికీలు ఉన్నాయి. దాని పొడవు 25 మీటర్లు, వెడల్పు పదమూడున్నర మీటర్లు.
26ఎక్కడానికి ఏడు మెట్లు, వాటికి ఎదురుగా కనిపించే మధ్య గోడలు ఉన్నాయి. దాని స్తంభాలపై కూడా ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
27లోపటి ఆవరణకు దక్షిణపు వైపున ఒక గుమ్మం ఉంది. ఈ గుమ్మం నుండి దక్షిణ ద్వారం వరకూ 54 మీటర్లు. లోపలి ఆవరణ గుమ్మం
28అతడు దక్షిణ దిశగా లోపలి ఆవరణలోకి నన్ను తీసుకుపోయి దక్షిణపు గుమ్మాన్ని కొలిచాడు. దాని కొలత అదే.
29దాని కావలి గదుల స్తంభాలు, మధ్య గోడలు పైన చెప్పిన కొలతకు సరిపోయాయి. దానికీ దాని చుట్టూ ఉన్న మధ్యగోడలకూ కిటికీలున్నాయి. దాని పొడవు 27 మీటర్లు, వెడల్పు పదమూడున్నర.
30చుట్టూ మధ్యగోడల పొడవు పదమూడున్నర, వెడల్పు రెండున్నర మీటర్లు.
31దాని మధ్య గోడలు బయటి ఆవరణం వైపుకు చూస్తున్నాయి. దాని స్తంభాల మీద ఖర్జూరపుచెట్లు చెక్కి ఉన్నాయి. వాటికి ఎనిమిది మెట్లున్నాయి.
32తరవాత ఆయన నన్ను తూర్పు వైపున లోపలి ఆవరణలోకి తీసుకెళ్ళి దాని గుమ్మాన్ని కొలిచాడు. దానికి కూడా పైన చెప్పిన కొలతే.
33దాని కావలి గదులకు స్తంభాలకు, మధ్యగోడలకు అదే కొలత. దానికి, దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకు కిటికీలున్నాయి. పొడవు 27 మీటర్లు, వెడల్పు 13 మీటర్ల 50 సెంటి మీటర్లు.
34దాని మధ్య గోడలు బయటి ఆవరణం వైపు చూస్తున్నాయి. వాటి స్తంభాల మీద రెండు వైపులా ఖర్జూరపుచెట్లు చెక్కి ఉన్నాయి. ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.
35అప్పుడతడు ఉత్తరపు గుమ్మానికి నన్ను తీసుకెళ్ళి దాని కొలిచినప్పుడు అదే కొలత ఉంది.
36దాని కావలి గదులకు, స్తంభాలకు, దాని మధ్య గోడలకు అదే కొలత. దానికి, దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకు కిటికీలున్నాయి. దాని పొడవు 27 మీటర్లు, వెడల్పు 13 మీటర్ల 50 సెంటి మీటర్లు.
37అటూ ఇటూ ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్న దాని స్తంభాలు బయటి ఆవరణం వైపుకు చూస్తున్నాయి. ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి. మందిర వాకిలి దాని ఉపకరణాలు
38ప్రతి గుమ్మం స్తంభాల దగ్గర వాకిలి ఉన్న ఒక గది ఉంది. ఆ గదుల్లో దహనబలి పశువుల మాంసం కడుగుతారు.
39గుమ్మపు మంటపాల్లో రెండు వైపులా రెండేసి బల్లలున్నాయి. వీటి మీద దహనబలి, పాప పరిహారార్థ బలి, అపరాధపరిహారార్థ బలులకు పశువులను వధిస్తారు.
40గుమ్మాల వాకిలి దగ్గర ఉత్తరాన మెట్లు ఎక్కే చోట రెండు వైపులా రెండేసి బల్లలున్నాయి. అంటే గుమ్మపు రెండు వైపులా నాలుగేసి బల్లలున్నాయి. వీటి పైన పశువులను వధిస్తారు.
41దహనబలి పశువులు మొదలైన వాటిని వధించడానికి వాడే ఉపకరణాలు ఉంచే ఎనిమిది బల్లలు ఈ వైపు నాలుగు, ఆ వైపు నాలుగు మెట్ల దగ్గర ఉన్నాయి.
42వాటి పొడవు సుమారు ఒక మీటరు, వెడల్పు సుమారు ఒక మీటరు, ఎత్తు అర మీటరు. వాటిని రాతితో మలిచారు.
43ఈ బల్లల మీద బలి అర్పణ మాంసాన్ని ఉంచుతారు. చుట్టూ ఉన్న గోడకు ఒక అడుగు పొడుగున్న మేకులు తగిలించి ఉన్నాయి.
44లోపటి గుమ్మం బయట, లోపలి ఆవరణంలో రెండు గదులున్నాయి. ఒకటి ఉత్తరం నుండి దక్షిణం వైపుకు, మరొకటి దక్షిణం నుండి ఉత్తరం వైపుకు చూస్తున్నాయి.
45అప్పుడతడు నాతో ఇలా అన్నాడు. “దక్షిణం వైపు చూసే గది మందిరానికి కావలి కాసే యాజకులది.
46ఉత్తరం వైపుకు చూసే గది బలిపీఠానికి కావలి కాసే యాజకులది. వీరు లేవీయుల్లో సాదోకు సంతతికి చెంది యెహోవా సన్నిధిలో సేవ చేసేవారు.”
47అతడు ఆ ఆవరణాన్ని కొలిచాడు. అది పొడవు, వెడల్పు సమానంగా 54 మీటర్లతో నలుచదరంగా ఉంది. మందిరానికి ఎదురుగా బలిపీఠం ఉంది.
48అతడు మందిర మంటపంలోకి నన్ను తీసుకొచ్చి మంటప స్తంభాలను ఒక్కొక్కటీ కొలిచినప్పుడు అది రెండు వైపులా 2 మీటర్ల 70 సెంటి మీటర్లు ఉన్నాయి. దాని ప్రవేశ ద్వారం వెడల్పు 7 మీటర్లు ఉంది. దానికి రెండు వైపులా ఉన్న గోడ మందం 1 మీటర్ 60 సెంటి మీటర్లు.
49మంటపం పొడవు 11 మీటర్లు. దాని వెడల్పు సుమారు 6 మీటర్లు. దాని పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. దానికి ఇరువైపులా స్తంభాలున్నాయి.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.