ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

1 దినవృత్తాంతాలు 6

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1లేవి కొడుకులు గెర్షోను, కహాతు, మెరారీ.
2కహాతు కొడుకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనే వాళ్ళు.
3అమ్రాము కొడుకులు అహరోను, మోషే. కూతురు పేరు మిర్యాము. అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
4ఎలియాజరుకు ఫీనెహాసు పుట్టాడు. ఫీనెహాసుకు అబీషూవ పుట్టాడు.
5అబీషూవకు బుక్కీ పుట్టాడు. బుక్కీకి ఉజ్జీ పుట్టాడు.
6ఉజ్జీకి జెరహ్యా పుట్టాడు. జెరహ్యాకి మెరాయోతు పుట్టాడు.
7మెరాయోతుకి అమర్యా పుట్టాడు. అమర్యాకి అహీటూబు పుట్టాడు.
8అహీటూబుకి సాదోకు పుట్టాడు. సాదోకుకి అహిమయస్సు పుట్టాడు.
9అహిమయస్సుకి అజర్యా పుట్టాడు. అజర్యాకి యోహానాను పుట్టాడు.
10యోహానానుకి అజర్యా పుట్టాడు. ఈ అజర్యా యెరూషలేములో సొలొమోను కట్టించిన మందిరంలో యాజకత్వం జరిగించాడు.
11అజర్యాకి అమర్యా పుట్టాడు. అమర్యాకి అహీటూబు పుట్టాడు.
12అహీటూబుకి సాదోకు పుట్టాడు. సాదోకుకి షల్లూము పుట్టాడు.
13షల్లూముకి హిల్కీయా పుట్టాడు. హిల్కీయాకి అజర్యా పుట్టాడు.
14అజర్యాకి శెరాయా పుట్టాడు. శెరాయాకి యెహోజాదాకు పుట్టాడు.
15యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదావాళ్ళనూ యెరూషలేము వాళ్ళనూ చెరలోకి బందీలుగా తీసుకు వెళ్లినప్పుడు ఈ యెహోజాదాకు కూడా చెరలోకి వెళ్ళాడు.
16లేవి కుమారులు గెర్షోను, కహాతూ, మెరారీలు.
17గెర్షోను కొడుకులు లిబ్నీ, షిమీలు.
18కహాతు కొడుకులు అమ్రామూ, ఇస్హారూ, హెబ్రోనూ, ఉజ్జీయేలూ అనేవాళ్ళు.
19మెరారి కొడుకులు మహలీ, మూషి. పూర్వీకుల వంశావళి ప్రకారం లేవీయుల కుటుంబాలు ఏవంటే,
20గెర్షోను కొడుకు లిబ్నీ, లిబ్నీ కొడుకు యహతు, యహతు కొడుకు జిమ్మా.
21జిమ్మా కొడుకు యోవాహు, యోవాహు కొడుకు ఇద్దో, ఇద్దో కొడుకు జెరహు, జెరహు కొడుకు యెయతిరయి.
22కహాతు కొడుకుల్లో ఒకడు అమ్మీనాదాబు. ఇతని కొడుకు కోరహు, కోరహు కొడుకు అస్సీరు,
23అస్సీరు కొడుకు ఎల్కానా, ఎల్కానా కొడుకు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కొడుకు అస్సీరు,
24అస్సీరు కొడుకు తాహెతు, తాహెతు కొడుకు ఊరియేలు, ఊరియేలు కొడుకు ఉజ్జియా, ఉజ్జియా కొడుకు షావూలు.
25ఎల్కానా కొడుకులు అమాశై, అహీమోతు.
26ఎల్కానా కొడుకుల్లో ఒకడు జోపై. జోపై కొడుకు నహతు,
27నహతు కొడుకు ఏలీయాబు, ఏలీయాబు కొడుకు యెరోహాము, యెరోహాము కొడుకు ఎల్కానా.
28సమూయేలు కొడుకులు ఎవరంటే, పెద్దవాడు యోవేలు, మరొకడు అబీయాయు.
29మెరారి కొడుకుల్లో ఒకడు మహలి. మహలి కొడుకు లిబ్నీ. లిబ్నీ కొడుకు షిమీ. షిమీ కొడుకు ఉజ్జా.
30ఉజ్జా కొడుకు షిమ్యా. షిమ్యా కొడుకు హగ్గీయా. హగ్గీయా కొడుకు అశాయా.
31నిబంధన మందసాన్ని యెహోవా మందిరంలో ఉంచిన తరువాత మందిరంలో సంగీత సేవ కోసం దావీదు నియమించిన వాళ్ళు వీళ్ళే.
32సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని నిర్మించే సమయంలో వీళ్ళు ప్రత్యక్ష గుడారం ఆవరణలో సంగీత సేవ చేస్తూ ఉన్నారు.
33ఈ విధంగా వీళ్ళు తమ కొడుకులతో కలసి పరిచర్య చేసినవాళ్ళు. కహాతీయుల కొడుకుల్లో గాయకుడైన హేమాను. ఇతను సమూయేలు కొడుకైన యోవేలుకి పుట్టాడు.
34సమూయేలు ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా యెరోహాముకి పుట్టాడు. యెరోహాము ఎలీయేలుకి పుట్టాడు. ఎలీయేలు తోయహుకి పుట్టాడు.
35తోయహు సూపుకి పుట్టాడు. సూపు ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా మహతుకి పుట్టాడు. మహతు అమాశైకి పుట్టాడు.
36అమాశై ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా యోవేలుకి పుట్టాడు. యోవేలు అజర్యాకి పుట్టాడు. అజర్యా జెఫన్యాకి పుట్టాడు.
37జెఫన్యా తాహతుకి పుట్టాడు. తాహతు అస్సీరుకి పుట్టాడు. అస్సీరు ఎబ్యాసాపుకి పుట్టాడు. ఎబ్యాసాపు కోరహుకి పుట్టాడు.
38కోరహు ఇస్హారుకి పుట్టాడు. ఇస్హారు కహాతుకి పుట్టాడు. కహాతు లేవికి పుట్టాడు. లేవి ఇశ్రాయేలుకి పుట్టాడు.
39హేమాను సహచరుడైన ఆసాపు కుడివైపున నిలుచుని ఉండేవాడు. ఈ ఆసాపు బెరక్యా కొడుకు. బెరక్యా షిమ్యా కొడుకు.
40షిమ్యా మిఖాయేలు కొడుకు. మిఖాయేలు బయశేయా కొడుకు. బయశేయా మల్కీయా కొడుకు.
41మల్కీయా యెత్నీ కొడుకు. యెత్నీ జెరహు కొడుకు. జెరహు అదాయా కొడుకు.
42అదాయా ఏతాను కొడుకు. ఏతాను జిమ్మా కొడుకు. జిమ్మా షిమీ కొడుకు.
43షిమీ యహతు కొడుకు. యహతు గెర్షోను కొడుకు. గెర్షోను లేవి కొడుకు.
44హేమానుకి ఎడమవైపున మెరారీయులు నిలుచుని ఉండేవాళ్ళు. వాళ్ళలో ఏతాను కీషీ కొడుకు. కీషీ అబ్దీ కొడుకు. అబ్దీ మల్లూకు కొడుకు. మల్లూకు హషబ్యా కొడుకు.
45హషబ్యా అమజ్యా కొడుకు. అమజ్యా హిల్కీయా కొడుకు.
46హిల్కీయా అమ్జీ కొడుకు. అమ్జీ బానీ కొడుకు. బానీ షమెరు కొడుకు.
47షమెరు మహలి కొడుకు. మహలి మూషి కొడుకు. మూషి మెరారి కొడుకు. మెరారి లేవి కొడుకు.
48వీళ్ళ సోదరులైన ఇతర లేవీయులను దేవుని మందిరానికి సంబంధించిన అన్ని పనులకు నియమించారు. అహరోనూ వంశం
49అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన అన్ని పనులూ అహరోనూ, అతని సంతానం చేస్తూ ఉన్నారు. వీళ్ళు దహన బలి అర్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు. అలాగే ధూపార్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు. ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఇదంతా దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లుగా జరిగేది.
50అహరోను సంతానం ఎవరంటే, అహరోను కొడుకు ఎలియాజరు. ఎలియాజరు కొడుకు ఫీనెహాసు. ఫీనెహాసు కొడుకు అబీషూవ.
51అబీషూవ కొడుకు బుక్కీ. బుక్కీ కొడుకు ఉజ్జీ. ఉజ్జీ కొడుకు జెరహ్య.
52జెరహ్య కొడుకు మెరాయోతు. మెరాయోతు కొడుకు అమర్యా. అమర్యా కొడుకు అహీటూబు.
53అహీటూబు కొడుకు సాదోకు. సాదోకు కొడుకు అహిమయస్సు.
54అహరోను వారసులకు కేటాయించిన స్థలాలు ఇవి. దీనికోసం చీటీలు వేసినప్పుడు మొదటి చీటీ కహాతీయుల కుటుంబాల పైన పడింది.
55దాని ప్రకారం యూదా దేశంలోని హెబ్రోనూ దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలూ వారికి అప్పగించడం జరిగింది.
56అయితే ఆ పట్టణం చుట్టూ ఉన్న పొలాలనూ దాని చుట్టుపక్కల గ్రామాలనూ యెఫున్నె కొడుకు కాలేబుకి ఇచ్చారు.
57అహరోను వారసులకు వచ్చిన పట్టణాలేవంటే, ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని పచ్చిక మైదానాలూ, యత్తీరూ, ఎష్టేమో దాని పచ్చిక మైదానాలూ,
58హీలేనూ, దాని పచ్చిక మైదానాలూ, దెబీరూ దాని పచ్చిక మైదానాలూ.
59అహరోను వారసులకు వీటితో పాటు ఆషానూ దాని పచ్చిక మైదానాలూ, బేత్షెమెషూ దాని పచ్చిక మైదానాలూ కూడా దక్కాయి.
60ఇంకా బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో నుండి గెబా దాని పచ్చిక మైదానాలూ, అల్లెమెతు దాని పచ్చిక మైదానాలూ, అనాతోతూ, దాని పచ్చిక మైదానాలూ కూడా వీరికి వచ్చాయి. ఇలా కహాతీయుల కుటుంబాలు మొత్తం పదమూడు పట్టణాలను పొందాయి.
61కహాతు వారసుల్లో మిగిలిన వాళ్లకు వారికి పడిన చీటీ ప్రకారం మనష్షే అర్థగోత్ర ప్రదేశాల్లో నుండి పది పట్టణాలు వచ్చాయి.
62గెర్షోను వారసులకు వాళ్ళ వివిధ తెగల ప్రకారం పదమూడు పట్టణాలు వచ్చాయి. ఇవి ఇశ్శాఖారూ, ఆషేరూ, నఫ్తాలీ, గోత్రాల ప్రదేశాల నుండీ బాషానులో ఉన్న మనష్షే అర్థగోత్ర ప్రదేశాల నుండీ ఇవ్వడం జరిగింది.
63మెరారీయులకు పడిన చీటీ ప్రకారం వాళ్ళ తెగలకు పన్నెండు పట్టణాలు వచ్చాయి. ఈ పట్టణాలను రూబేనూ, గాదూ, జెబూలూనూ గోత్రాల ప్రదేశాల నుండి ఇవ్వడం జరిగింది.
64ఈ విధంగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణాలనూ వాటి పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
65వాళ్ళు చీటీ వేసి, ముందు పేర్కొన్న పట్టణాలను యూదా, షిమ్యోనూ, బెన్యామీను గోత్ర ప్రదేశాల నుండి వాటిని కేటాయించారు.
66కహాతీయుల తెగలో కొందరికి ఎఫ్రాయిము గోత్రానికి చెందిన కొన్ని పట్టణాలను ఇచ్చారు.
67ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని ఆశ్రయ పట్టణమైన షెకెము, దాని పచ్చిక మైదానాలనూ, గెజెరున దాని పచ్చిక మైదానాలనూ,
68యొక్మెయాము దాని పచ్చిక మైదానాలనూ, బేత్‌హోరోను దాని పచ్చిక మైదానాలనూ,
69అయ్యాలోను దాని పచ్చిక మైదానాలనూ, గత్రిమ్మోను దాని పచ్చిక మైదానాలనూ, వాళ్ళకి ఇచ్చారు.
70అలాగే మనష్షే అర్థగోత్ర ప్రదేశాల నుండి ఆనేరు దాని పచ్చిక మైదానాలనూ బిలియాము దాని పచ్చిక మైదానాలనూ, కహాతీయులకు ఇచ్చారు.
71అలాగే మనష్షే అర్థగోత్రం వాళ్ళ నుండి గెర్షోనీయులకు బాషానులో ఉన్న గోలాను ప్రాంతం, దాని పచ్చిక మైదానాలూ, అష్తారోతూ దాని పచ్చిక మైదానాలూ,
72ఇశ్శాఖారు గోత్రం నుండి కెదెషూ, దాని పచ్చిక మైదానాలూ, దాబెరతు, దాని పచ్చిక మైదానాలూ,
73రామోతూ దాని పచ్చిక మైదానాలూ, ఆనేమూ దాని పచ్చిక మైదానాలూ,
74ఆషేరుగోత్రం నుండి మాషాలూ దాని పచ్చిక మైదానాలూ, అబ్దోనూ దాని పచ్చిక మైదానాలూ,
75హుక్కోకూ దాని పచ్చిక మైదానాలూ, రెహోబూ దాని పచ్చిక మైదానాలూ,
76నఫ్తాలి గోత్రం నుండి గలిలయలో ఉన్న కెదెషు దాని పచ్చిక మైదానాలూ, హమ్మోనూ దాని పచ్చిక మైదానాలూ, కిర్యతాయిమూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
77ఇంకా మిగిలిన లేవీయుల్లో మెరారీ వారసులకు జెబూలూను గోత్రం నుండి రిమ్మోను దాని పచ్చిక మైదానాలూ, తాబోరూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
78ఇంకా వారికి యెరికోకి అవతల వైపు యొర్దానుకి తూర్పుగా ఉండే రూబేను గోత్ర ప్రదేశాల నుండి అరణ్యంలోని బేసెరు దాని పచ్చిక మైదానాలూ, యహజా దాని పచ్చిక మైదానాలూ,
79కెదేమోతూ దాని పచ్చిక మైదానాలూ, మేఫాతూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
80అలాగే గాదు గోత్ర ప్రదేశాల నుండి గిలాదులోని రామోతూ దాని పచ్చిక మైదానాలూ, మహనయీము దాని పచ్చిక మైదానాలూ,
81హెష్బోనూ దాని పచ్చిక మైదానాలూ, యాజెరూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.